Friday, March 1, 2019

చదువులమ్మ చెట్టునీడ కావాలని ఉన్నదీ ॥
ధనములేమి తనము కాస్త తొలగాలని ఉన్నదీ ॥

బడులెన్నో ప్రతి వీధిలొ బడుగుబాలలోడిపోతు
మనసుసైన మాష్టారునే పొందాలని ఉన్నదీ ॥

అందమైన భవంతిలో అదిగో అది పాఠశాల
నేనక్కడ విద్యార్ధిగ చదవాలని ఉన్నదీ ॥

మిక్కిలైన ధనకాంక్షలు విద్యకూడ వ్యాపారమె
అక్షరాన్ని నేనౌతూ నేర్వాలని ఉన్నదీ ॥

నేతలార శ్రోతలార తెలియలేద మా గోడులు
ఆ వాణీ దీవెనతో మెరవాలని ఉన్నదీ ॥

పసితనాలు బందీలే మా బాల్యం పనిలోనే
మా హక్కును మేముకూడ గెలవాలని ఉన్నదీ ॥

కూలివాని బతుకులోన కాంతిఎపుడు వస్తుందో
అవినీతికి చరమగీతి పాడాలని ఉన్నదీ ||
.....వాణి కొరటమద్ది

No comments:

Post a Comment