Friday, March 1, 2019

ఎదురు చూపుల ఆశ ఇంకా సమసి పోలేదు ||
జ్ఞాపకాలే మౌనమదిలో వడలి పోలేదు ||

మమత దాచిన అమ్మ తనమే మనసు నిండా
రెప్పపైననే కంటితడులు ఇగిరి పోలేదు ||

చెమరించే చెరపలేని గాయపుమరకలు
గుండె పగిలిన దృశ్యమింకా చెరిగి పోలేదు ||

అక్షరాలుగ రాసి పోసిన కంటిచుక్కలు
తిమిరనదులను ఈదుతున్నా తరిగి పోలేదు ||

నిష్క్రమించిన నిన్నుతలచుతు నిదురమరిచాను
బాధ నంతా భావమల్లుతు అలసి పోలేదు ||

విధిని నెగ్గుట సాధ్యమౌనా నిన్ను చేరే దారిలో
కాలమెంతగ కదులుతున్నా మరిచి పోలేదు ||

గగనమంతా నీదె అయినది గమనమాగిపోయెనె
ఊహలన్ని నీతో నిండి నా ఊపిరాగి పోలేదు ||

No comments:

Post a Comment