Friday, March 1, 2019

పువ్వుల్లొ చిరునవ్వు పేర్చేము బతుకమ్మ
పండుగలొ హాసాలు నింపేము బతుకమ్మ

బ్రతుకంత నవ్వుల్ల వరమడిగ మ్రొక్కాము
నినుకొలువ సంబరం నిండేను బతుకమ్మ

పాటలతొ ఆటలతొ సందడే చేశాము
కోలాటమాడుతూ కులికేము బతుకమ్మ

అందంగ సుమముల్లొ నిను చూసి మురిశాము
కుసుమంలొ నీరూపు మెరిసేను బతుకమ్మ

బంధాలు గట్టిగా నిలబెట్ట మంటున్నా
కలసిమెలసి జన్మంత సాగేము బతుకమ్మ

వెన్నెలలు నింపమ్మ బంగారు బతుకమ్మ
ఆనంద పరిమళం పంచేము బతుకమ్మ
..వాణి కొరటమద్ది

No comments:

Post a Comment