Friday, March 1, 2019

కనిపించని గాయాలను చూపలేను నేస్తమా ||
గుండెలోని దుఃఖాలను చెరపలేను నేస్తమా ||

ఆవిరవదు ఆలోచన అలసిపోని సంఘర్షణ
మనసులోని మర్మాలను తుడవలేను నేస్తమా ||

జ్ఞాపకాలు మదిని విడచి మరలి వెళ్ళ లేవులే
తడి తలపుల జాడలవి విడువలేను నేస్తమా ||

అంతులేని ఆవేదన అక్షరమై ఒలుకుతుంది
గతమైనవి చిరునవ్వులు చేరలేను నేస్తమా ||

కలతలన్ని కన్నీళ్ళలను చిలుకుతూనె ఉన్నాయి
కాలమెంత కరుగుతున్న ఆపలేను నేస్తమా ||

మౌన వాణి మానసమే భావాలకు తోరణమే
అలజడులను రెప్పలపై దాచలేను నేస్తమా ||
.....కొరటమద్ది వాణి

No comments:

Post a Comment