Monday, April 16, 2018

అద్భుతమే శూన్యమైతె చూడలేరు ఎవరైనా ||
అంతులేని ఆకశాన్ని చుట్టలేరు ఎవరైనా ||
ఆశలతో ముడిపడుతూ ఎదురీతే బ్రతుకంతా
కాలానికి సంకెళ్ళను వేయలేరు ఎవరైనా ||
గతమంతా అనుభవమే గమనానికి దాసోహం
ఊహలకే ఊపిరులను పొయ్యలేరు ఎవరైనా ||
చెమ్మగిల్లిన కన్నుల్లో దుఃఖాలో సంతసాలొ
కన్నీళ్ళకు వర్ణాలను అద్దలేరు ఎవరైనా ||
చెమటచుక్క చెపుతున్నది శ్రమజీవన సౌందర్యం
కష్టపడక ఫలితాలను పొందలేరు ఎవరైనా ||
చెరిగినపోయె ఆనందం వీడిపోయి ఒక బంధం
మౌన వాణి భావాలను అంద లేరు ఎవరైనా ||
.......వాణి వెంకట్

No comments:

Post a Comment