Sunday, June 3, 2018

//ప్రేవు బందం...//

ప్రేవు బందాన్ని జ్ఞాపకం చేసుకుంటూ..
మదిలో స్మృతిలా మిగిలిన నీ రూపం

ఆశల పల్లకీలో ఊరేగిద్దామనుకున్నా
అంతిమ వీద్కోలు తీసుకున్నావు

చేతుల్లో నిను ప్రేమతోమోయాలనుకున్నా
మనసులో నీ వెంటే వుంటానని మౌనంగా వెళ్ళావు

అనుక్షణం ఆత్మీయంగా అక్కున చేర్చుకోవాలను కున్నా
ఆత్మగా మరో రూపంలోకి మారి పోయావు

నన్ను వొదలి పోవనుకున్నా
తలపుల్లో నీ వెంటే వున్నానంటున్నావు

తిరిగి రావని తలచి ఆగిపోకున్నాయి కన్నీళ్ళు
నీ మనసంతా నేనమ్మ మరల రాకున్నా అంటున్నావు

నీ స్పర్శతో మనసుని సేద దీర్చవా చిన్నా అంటున్నా
చేత కాని పని చేయ లేనంటున్నావు

ఆశగా నా మనసు ఆత్రం పడుతూనే వుంది
అదృస్టమై వస్తావని...!!!

.....వాణి కొరటమద్ది
2 june 2014

No comments:

Post a Comment