Friday, March 1, 2019

అన్వేషణ

ఎదిగే వయసు
ఒదిగే కాలం
రేపటిలోకి చూడాలని
రెప్పల తడి ఆర్పాలని

ఓడి పోయే ఎదురుచూపులు
ఊహల్లో మిగిలిన జ్ఞాపకాలు
తలవని క్షణం లేదు
తడవని రోజూ లేదు
బాధ , భావం
అక్షర అన్వేషణలో
పచ్చి కన్నీళ్ళ వెచ్చదనం
కొత్తగా వ్యక్తపరుస్తూ
కలం , కవనం మధ్య
నలుగుతున్న మనసు
అరుదైన గమనాన్నై
ప్రతి అడుగు అపురూపమై
వేకువకై , వెన్నెలకై తపన పడే
సగటు జీవి ఆరాటం
ఎటో తెలియని పయనం
బంధాలకై ఆరాటం
అనుభూతులు తడుముకుంటూ
దూరం దగ్గరవ్వాలని
అటు లేకున్నా
ఇటు ప్రయత్నమాపలేని నిస్సహాయత
అంతిమం తెలియదు
శ్వాసను ఆపనూలేను
బరువైన ముగింపు కోరుకోలేక
పలుకరించే స్పర్శకై
ఆఖరి మజిలీ దాకా ..!!
..... కొరటమద్ది వాణి

No comments:

Post a Comment