Friday, March 1, 2019

ఆత్మీయత అలసి పోయి దూరం అయ్యిందా ?
అనుబంధం ఉనికి మరిచి మాయం అయ్యిందా ?

జ్ఞాపకాల పయనంలో మనసు నిలచి పోతోంది
అనుభూతుల సంచారం సాయం అయ్యిందా ?

అంతరంగ మదనంలో ఆత్మ స్మర్శ తెలిసింది
శూన్యంతో చెలిమెందుకొ అర్ధం అయ్యిందా ?

మాటలన్ని మౌనంలో బందీ అయిపోయె కదా
అంతరంగ పయనమిపుడు త్యాగం అయ్యిందా ?

నటనలోనె జీవితం నవ్వు మెరుపు మరిచింది
గుండెను మెలిపెట్టు కథ భారం అయ్యిందా ?

మధుర వాణి ఆశయాల రెక్క విరిగి పోయిందే
కన్నీళ్ళను దాచలేక తిమిరం అయ్యిందా ?

......కొరటమద్ది వాణి

No comments:

Post a Comment