Friday, March 1, 2019

కావాలని


అలిగి వెళ్ళి పోయాయి అక్షరాలు
అలసిన మనసుకు ఓదార్పునివ్వలేక
మౌనమైయ్యింది మానసం
అంతరంగ లోతుల్ని అందుకోలేక
చీకటి నిట్టూరుస్తోంది
శూన్యం శత్రువైయ్యిందంటూ
అలజడి ఏమిటో అర్ధం కావడంలేదు
అంతుచిక్కని అంతఃసంఘర్షణ
బాధకు బంధువునే ఎప్పుడూ
బంధాల ముసుగును తొలగించలేక
ఎన్ని చిత్రాలో బ్రతుకులో
విముక్తి కాలేని వింత గమనాలు
కాలానికి బానిసనే
కదలక తప్పని అడుగులతో
ఇప్పుడు కొన్ని అక్షరాలు కావాలి
కన్నీళ్ళు తుడుచుకోవాలి..!!
.....వాణి

No comments:

Post a Comment