కదిలి పోతోంది కాలం నువ్వు లేకుండా
ఓ నవ్వు లేకుండా
జీవం ఆశను అంటిపెట్టుకునే వుంది
బాధ్యతగానో బంధంగానో
నిన్నలన్నీ లెక్కగానే వున్నాయి
సంవత్సరాల చరిత్రగా మిగులుతూ
గతమైన వడలిన రోజులు
గాయాలుగా మారాయి
చెరపలేని మరకలెన్నో
జ్ఞాపకాలుగా రోదిస్తూ ..
ఓడిపోయే ఎదురుచూపులు
చెరువ కాలేని ఎడబాటులు
నీ ఆలాపనలేవో వినిపిస్తూ
ఎదగని నిన్ను గుర్తులుగా మోస్తూ
పరిపక్వతలో నీ పరిపూర్ణ రూపాన్ని ఊహిస్తూ
ఇదిగో ఇలా సంవత్సరాలు దాటుతున్నాయి
వేదనలో నీవున్నావు
ఓదార్పులో నువ్వే కనిపిస్తావు
గడపలేని ఈరోజు దొర్లుకుంటూ వెళుతోంది
ఆశపడని రేపటిని ఆహ్వానించక తప్పడంలేదు
చిరకాలం నావెంట వుంటావని తలపించా
'చింటూ' నీవు చిరంజీవనే అనుకున్నా
చిన్న కోరికకూడా అత్యాసే అయ్యింది
నీ అంతిమ శ్వాస ఆపలేని నిస్సహాయత నాది
విషాద నిట్టూర్పుగా.!!
...వాణి
బాధ్యతగానో బంధంగానో
నిన్నలన్నీ లెక్కగానే వున్నాయి
సంవత్సరాల చరిత్రగా మిగులుతూ
గతమైన వడలిన రోజులు
గాయాలుగా మారాయి
చెరపలేని మరకలెన్నో
జ్ఞాపకాలుగా రోదిస్తూ ..
ఓడిపోయే ఎదురుచూపులు
చెరువ కాలేని ఎడబాటులు
నీ ఆలాపనలేవో వినిపిస్తూ
ఎదగని నిన్ను గుర్తులుగా మోస్తూ
పరిపక్వతలో నీ పరిపూర్ణ రూపాన్ని ఊహిస్తూ
ఇదిగో ఇలా సంవత్సరాలు దాటుతున్నాయి
వేదనలో నీవున్నావు
ఓదార్పులో నువ్వే కనిపిస్తావు
గడపలేని ఈరోజు దొర్లుకుంటూ వెళుతోంది
ఆశపడని రేపటిని ఆహ్వానించక తప్పడంలేదు
చిరకాలం నావెంట వుంటావని తలపించా
'చింటూ' నీవు చిరంజీవనే అనుకున్నా
చిన్న కోరికకూడా అత్యాసే అయ్యింది
నీ అంతిమ శ్వాస ఆపలేని నిస్సహాయత నాది
విషాద నిట్టూర్పుగా.!!
...వాణి
No comments:
Post a Comment