Friday, March 1, 2019

చీకటిలొ అందంగ మురిసింది రాతిరి ||
ఏవేవో ఊసుల్ని మోసింది రాతిరి ||

కమ్మనీ కలలెవో విడలేను జన్మంత
గుండెల్లొ కథనాలు నింపింది రాతిరి ||

రెప్పలను తెరవాల మధురిమలు తొలగేను
మౌనంగ సందడులు పంచింది రాతిరి ||

తీయ్యనీ అలసటలు తలపంత మోయాలి
అరుదైన చెలిమితో మెరిసింది రాతిరి ||

పరవశం చిత్రంగ పరిమళం అద్దింది
ఉదయాన్ని గెలుపుగా పిలిచింది రాతిరి ||

రేయంత మూగగా నిశ్శబ్దం నెగ్గింది
ముచ్చట్లు దాచేసి మిగిలింది రాతిరి ||

మనసంత మధురమై అనుభూతి నిండుతూ
ఆనంద అమృతం గ్రోలింది రాతిరి ||
......కొరటమద్ది వాణి

No comments:

Post a Comment