నీటి సుడులను మనసు మడిలో దాచుకుంటిని ఇంతకాలం ||
ఙ్ఞాననేత్రం మూసుకొంటే తడుముకుంటిని ఇంతకాలం ||
మౌనవాణియ మూగబోయెను తంత్రితెగిన వీణవోలే
నొప్పి ఎంత సలుపుతున్నా ఓర్చుకుంటిని ఇంతకాలం ||

పట్టుతప్పిన క్షణాలెన్నో కనులనిండిన వెతలనీరే
చమురు లేని వత్తివోలే వెలుగుతుంటిని ఇంతకాలం ||
ఆశ నడపిన కాలమేదో వెనుక నిలచెను బరువుగానే
మౌన కథలను హృదయతడితొ పేర్చుకుంటిని ఇంతకాలం ||
అడుగు పెట్టిన అశ్రునీడలు నిశలు నింపుతు నిలచి వుండెను
ఎన్ని అనుభవ రాతలో మరి చేర్చుకుంటిని ఇంతకాలం ||
తరలిపోయెను కాలగతిలో తపనపడ్డ ఆశలెన్నో
కొత్త ఉదయం కొంత కోరిక గడుపుతుంటిని ఇంతకాలం ||
భావ జగతిలో పరుగుపెట్టే నడకలెన్నో నేర్చుకుంటూ
గతం నిలిపిన గాధలన్నీ కూర్చుకుంటిని ఇంతకాలం ||
.......వాణి కొరటమద్ది

No comments:
Post a Comment