Friday, March 1, 2019

దుఃఖాలను చీకటెలా మోసిందని అడగొద్దు ||
తడిమరకలు వెలుతురెలా తుడిచిందని అడగొద్దు ||

కలవరమై పోతున్నా కలలకొరకు తపియిస్తూ
స్వప్నాలను వేకువెలా చెరిపిందని అడగొద్దు ||

అనుబంధం ఆత్మీయత అలసి పోతువున్నాయా..?
బంధాలకు బలిమిఎలా తరిగిందని అడగొధ్దు||

ఊహించని గాయాలకు శిక్షనెలా మోయాలి..?
నమ్మకాన్ని మనసు ఎలా నెగ్గిందని అడగొద్దు ||

ఎదురయ్యే బాటలలో సవాళ్ళెన్ని పిలిచాయో
అడుగడుగున మౌనమెలా గెలిచిందని అడగొద్దు ||

చిరునవ్వుల చెలిమి ఏల చేెజారుతు వున్నదో
చెక్కిలిపై అలక ఎలా కలిగిందని అడగొద్దు ||
......వాణి కొరటమద్ది

No comments:

Post a Comment