Friday, March 1, 2019

కల 'త...


మురిసిన ఆ క్షణాలింకా
మనసు వాకిట్లో మసలుతున్నాయి
కరిగిన కాలంలో కలతపడిన
ఘటనలింకా కదలాడుతున్నాయి
మమతగా హత్తుకుని మధురంగా తడుముకుని
అమ్మతనాన్ని ఆస్వాదించిన ఆ ఆనందం
జ్ఞాపకాల చట్రంలో చిరునవ్వులు ఇరుక్కు పోయి
దుఃఖంతో దోబూచులాడుతోంది గమనం
విధిని ఎదురీదలేక మిగిలింది తనువు
అనుభూతులు చెరిపెయ్యలేక నలిగేది మనసు
అశ్రువులు రాల్చుకుంటూ నిశ్శబ్దం నిలదీస్తూనే వుంది
మాతృత్వం మౌనంగా రోదిస్తూ..!!

No comments:

Post a Comment