Friday, March 1, 2019

జ్ఞాపకాన్ని బంధంగా మోసినదీ మానసమే ||
తలపులన్ని భావాలుగ మలిచినదీ మానసమే ||

అంతులేని కోరికలే అవధిలేని స్వార్ధాలే
శిక్షలన్ని మనసుకైతె కుమిలినదీ మానసమే ||

చెదురుతున్న జీవితాలు అందలేక ఆత్మీయత
ధనమే మన గమనమైతె రగిలినదీ మానసమే ||

గుండెల్లో గుబులైనది గుర్తు మరిచి పోలేను
కన్నుల్లో చెమరింతను చిలికినదీ మానసమే ||

మనుగడెంత బరువైనదొ విలువలన్ని వెలసిపొయి
మనిషితనం జాడకొరకు వెతికినదీ మానసమే ||

మౌనానికి తలవంచక తప్పలేదు చూశావా
అహంకార ముసుగుచూసి తడిచినదీ మానసమే ||

మధురవాణి నిశ్శబ్దాన్ని నెగ్గలేక పోయిందే
సహనానికి సహవాసం నేర్పినదీ మానసమే ||
.....కొరటమద్ది వాణి

No comments:

Post a Comment