Friday, March 1, 2019

శబ్ధ స్వర భంగిమలో కురిపించెను భావాలను ||
ప్రకృతెంత పరవశమో పలికెంచెను భావాలను ||

వసంతమే రాగమైతె రంజిల్లద మనసంతా
తేజరిల్లు ప్రృధ్విపైన నర్తించెను భావాలను ||

ఆమని ఓ అపురూపం సృష్టే ఒక ఆశ్చర్యం
వనమంతా పులకించగ మ్రోగించెను భావాలను ||

అతిశయమే అభినయాలు నవరసాల రూపాలు
తనహస్తపు ముద్రలతో చిత్రించెను భావాలను ||

జయదేవుని అష్టపదులు విరచించిన గమకాలు
మువ్వలసడి మర్మంగా వినిపించెను భావాలను ||

తుమ్మెదలా తచ్చాడుతు మయూరాన్ని మరిపించెను
మరందంల మధురంగా రవళించెను భావాలను ||

ఆకాశం మురిసింది మెరుపులతో దీవిస్తూ
పంచభూతాలవింత వర్ణించెను భావాలను ||
.....కొరటమద్ది వాణి

No comments:

Post a Comment