Saturday, March 2, 2019

ఎదలోన మౌనంగ కురిసేటి బాధ ||
ఙ్ఞాపకం గాలిలా తాకేటి బాధ ||
.
వడలుతూ పువ్వులా వేలాడు మనసు
వెన్నెల్లొ వేదనే మోసేటి బాధ ||

.
చూపుల్లొ నిట్టూర్పు కన్నీటి ఓర్పు
గుర్తులే గుండెల్లొ సలిపేటి బాధ ||
.
గతమైన ఘటనలే బరువైన దృశ్యం
దుఃఖాలు నీడలై పొగిలేటి బాధ ||
.
కన్నుల్లొ చీకట్లు మదిలోతు శూన్యం
గతితప్పి ఆశలే కుమిలేటి బాధ ||
.
చీకటే గెలిచిందా వెలుగునే దోచి
తడబాటు తిమిరంలొ తడిసేటి బాధ ||
.
.........వాణి కొరటమద్ది

Friday, March 1, 2019

ఎదలోన మౌనంగ కురిసేటి బాధ ||
ఙ్ఞాపకం గాలిలా తాకేటి బాధ ||
.
వడలుతూ పువ్వులా వేలాడు మనసు
వెన్నెల్లొ వేదనే మోసేటి బాధ ||

.
చూపుల్లొ నిట్టూర్పు కన్నీటి ఓర్పు
గుర్తులే గుండెల్లొ సలిపేటి బాధ ||
.
గతమైన ఘటనలే బరువైన దృశ్యం
దుఃఖాలు నీడలై పొగిలేటి బాధ ||
.
కన్నుల్లొ చీకట్లు మదిలోతు శూన్యం
గతితప్పి ఆశలే కుమిలేటి బాధ ||
.
చీకటే గెలిచిందా వెలుగునే దోచి
తడబాటు తిమిరంలొ తడిసేటి బాధ ||
.
.........వాణి కొరటమద్ది
బ్రతుకు ఆట ముగిసేపోతె మరలొస్తుందా ఏమైనా ?
జ్ఞాపంకంగ మిగిలేపోతె తరలొస్తుందా ఏమైనా ?
.
ఆశవీడదు అంతమవ్వదు ధనమే కాంక్ష కాదా ?
చివరి ప్రయాణం చిత్రమేమిటో తెలిసొస్తుందా ఏమైనా ?
.

పరిమళమద్దిన నిన్నటిపువ్వు మట్టిలొఇమిడే పోవుకద
కొత్త మొగ్గకు తావు ఇవ్వక వికసిస్తుందా ఏమైనా ?
.
సూర్యతేజము జీవనచట్రం ఆగిపోవున ఉప్పెనొచ్చిన
వేదన మనసును నలిపేస్తుంటే నవ్వొస్తుందా ఏమైనా ?
.
ఎగిసే అలలకు పారే నదులకు తీరం పాఠం నేర్పాలా
జారినమాట తరలిన కాలం తిరిగొస్తుందా ఏమైనా ?
.
తలరాతంటు తలపోస్తుంటే ఓటమి మిగిలే పోవుకద
శక్తికి ఊతం ఇవ్వకపోతె గెలుపోస్తుందా ఏమైనా ?
.
మధుర వాణియ పెదవిమాటున మౌనంగానె ఉంటోంది
నిశి రాత్రులపై నిందలువేస్తె వెలుగొస్తుందా ఏమైనా ?
.
...............వాణి కొరటమద్
ఎడబాటులు భారమౌను ఓపలేను ప్రియతమా ||
తడబాటుల బ్రతుకునావ నడపలేను ప్రియతమా ||

క్షణమైనా నీ దూరం కలనైనా కనలేదె
నీవులేని చూపునసలు కదపలేను ప్రియతమా ||

మౌనమైన మందలింపు తలవంచితి నేస్తమా
తచ్చాడే మదిని వీడి తరల లేను ప్రియతమా ||

చెలిమి తలపు వీడబోను చెదిరిపోవు చిరునవ్వె
అలుకలపై చిరు కోపము తాళ లేను ప్రియతమా ||

అంతరంగమంత నీవె అలుపు లేని సందడులె
నీవులేని నిశ్శబ్దాలు మోయలేను ప్రియతమా ||

చీకటసలె చేరదేమి వెన్నెలంత మౌనమై
శిధిలమౌతు మధురవాణి పలుక లేను ప్రియతమా ||
.......కొరటమద్ది వాణి,
తిరిగిరాని బాల్యానికి తరలి వెళితె బాగుండును ||
అందమైన లోకానికి తిరిగి వెళితె బాగుండును ||

కల్మషమే లేనితనం అలనాటిది సంబరం
చిందులేయ పసితనంకి మరలి వెళితె బాగుండును ||

లెక్కించని ఆ కాలం ఎలా వెళ్ళి పోయిందో
చెలిమి పూలు ఏరెందుకు మళ్ళి వెళితె బాగుండును ||

అదే మట్టి అదే చెట్టు మధురమైన జ్ఞాపకాలు
అరుదైనది ఆనందం తలచి వెళితె బాగుండును ||

ప్రియమైనది నానేస్తం మనసులోన మెదిలింది
తన స్నేహపు సుగంధాలు తీసి కెళితె బాగుండును ||

గుర్తెరిగిన వాన ఆట పడి లేచిన పరుగులాట
మురిసిపోవ మనసంతా కదిలి వెళితె బాగుండును ||

ఓ మాధవి కౌసల్యా వినలేదా నా వాణీ
తీరంలో మన సందడి చూసి వెళితె బాగుండును ||
.....వాణి కొరటమద్ది
కరిగిపోయిన కలలరూపం చెంతచేరిన ఎంతహాయీ ||
మూగబోయిన మధురవాణియ పెదవివిప్పిన ఎంతహాయీ ||
.
ఙ్ఞాపకాలే నిధులుఅయితే గాయఘటనలు మరువలేమే
వెంటవచ్చే వేదనంతా చెరిగిపోయిన ఎంతహాయి||

.
కాలమెంతటి కఠినమైనదొ పసితనాలకు శిక్షవేస్తూ
చిలిపినవ్వులు మాలగుచ్చుతు కానుకిచ్చిన ఎంతహాయీ ||
.
నిన్నమొన్నలు మసకబారక మనసులోనే నడుస్తున్నవి
చేదునింపిన చరితలన్నీ చెరిగిపోయిన ఎంతహాయీ ||
.
పలకరింపులు జ్ఞాపకాలే బంధాలన్ని ప్రశ్నలైనవి
గమనమంతా గతములోనే సంచరించిన ఎంతహాయీ ||
.
రాలుతున్నవి అక్షరాలే మౌనమైనవి భావఝరులే
మూగబోయిన ఆశలన్నీ మురిసిపోయిన ఎంతహాయీ ||
.
చింతలన్నీ విసుగుచెెందితె చరమగీతం పాడమంటిని
నవ్వులోకం హత్తుకుంటూ స్వాగతించిన ఎంతహాయీ ||
.
......వాణి కొరటమద్ది
తొలిస్పర్శ మనసంత నిమురుతూ ఉంటుంది ||
తండ్రైన గర్వమే నిండుతూ ఉంటుంది ||

మురిపంగ లాలిస్తు చేతుల్లొ పసితనం
సంతోష సవ్వడులు నింపుతూ ఉంటుంది ||

కదిలికలు మధురమై నాదైన పాపాయి
నాన్నంత తనదని నవ్వుతూ ఉంటుంది ||

నా కలల లోకంలొ అరుదైన అదృష్టం
చిరునవ్వు దీవెనగ చేరుతూ ఉంటుంది ||

తన బోసి నవ్వుల్లొ విజయాలు నావౌతు
ఆశ్చర్యమందంగ మిగులుతూ ఉంటుంది ||

చూపుల్లొ ప్రేమెంత ఆటల్లొ కేరింత
దరహాస మధురిమలు అద్దుతూ ఉంటుంది ||

నన్నంత మరిపిస్తు తానంత నాదౌతు
వెంటాడు ఆశగా తాకుతూ ఉంటుంది ||

ఇల్లంత గలగలలు తన అందె రవములతొ
కిలకిలల నవ్వులతొ వెలుగుతూ ఉంటుంది ||

చిన్నారి అమ్మగా అనురాగ మద్దుతూ
తడితలపు గుండెల్లొ తడుపుతూ ఉంటుంది ||
.........కొరటమద్ది వాణి
చిరునవ్వు సందడిని చెరిపేది గాయం ||
చీకటిని చిత్రంగ చుట్టేది గాయం ||

అపురూప రూపాన్ని మింగింది కాలం
వేదనను మౌనంగా మోసేది గాయం ||

ఆశల్ని అలసుగా తుడిచేసి పోతూ
కన్నీటి నదిలోన ఈదేది గాయం ||

ఓ భ్రాంతి కాంతికై తడుము కుంటోంది
గుర్తులతొ గుండెల్ని పిండేది గాయం ||

అశ్రువులు అలిశాయి చింతల్ని మోసి
దుఃఖాల నావనే నడిపేది గాయం ||

రహదారి అందమే ఆనంద నడకలో
అదృశ్య మైపోతె మిగిలేది గాయం ||

శూన్యంలొచూపులే తచ్చాడుతున్నా
నిశిలోన వాణిగా చరిచేది గాయం ||
.......వాణి కొరటమద్ది
ఎన్ని ఆకలి రాత్రులు నిశ్శబ్దంగా మింగేశాడో
ఎన్ని కన్నీళ్ళతో భూమాతను అభిషేకించాడో
గమనించని బాటసారులెందరిని ఆర్తిగా వేడుకున్నాడో
చీదరించిన చూపులకు చితికి పోయాడు

కడుపునింపని కాలానికి సలాం చెప్పేసి
చిట్టి చేతులకు గాయాలు చేసుకుంటున్నాడు
పదిలంగా హత్తుకునే ఆత్మీయత కరువైయిందేమో
పలుకరించే ఊపిరికి ఊతమవ్వాలనుకున్నాడు
ఆకలి తీర్చే అమ్మే దూరమైయ్యిందేమో
పేదరికం వెక్కిరించి వేదనకు గురిచేస్తుంటే
తప్పని బ్రతుకు పోరాటంలో
బాల్యాన్ని పనికి తాకట్టు పెట్టాడు
రేపటి పౌరుడి పసితనం పనికి బానిసౌతోంది
స్వార్దం రాజ్యమేలుతుంటే
పిల్లల చిరునవ్వులు వెట్టి చాకిరికి అంకితమౌతున్నాయి.
తరలిపోతున్న సంవత్సరాలు చూస్తున్నాం
మార్పురాని బ్రతుకు చిత్రాలను చూడలేక....!!
.....వాణి కొరటమద్ది,
వెలుగు వెనుక దాగున్నది వెలివేసిన చీకటి ||
జాబిలి పరదా చాటున ముసుగేసిన చీకటి ||

రేతిరిలో మదిలోతును కదిలించిన గుర్తులే
కన్నీటివి కథలెన్నో దాచేసిన చీకటి ||

కాలమిచ్చు సవాళ్ళెన్నో విధివేసిన శిక్షలెన్నొ
మౌనంగా గుండెగూడు తడిపేసిన చీకటి ||

అలసిపోని ఆలోచన సలుపుతున్న వేదన
మనసుపడే సంఘర్షణ సరిచేసిన చీకటి ||

తరలిపోతు రమ్మంటు వెన్నెలతో చెలిమిగా
ఏకాంతపు తాయిలాలు పంచేసిన చీకటి ||

మధురవాణి మౌనమైన భావాలకు తోడుగా
జ్ఞాపకాల చరితలన్ని తవ్వేసిన చీకటి ||
.......వాణి కొరటమద్ది
మౌనాలను రంగరించి మనసు లేఖ రాస్తున్నా ||
మదినిండిన ప్రేమలతో హృదయ లేఖ రాస్తున్నా ||

అనుభూతుల పరిమళాలు గుర్తులలో సంబరాలు
గతమైనవి సంగతులే ప్రేమ లేఖ రాస్తున్నా ||

ఇదిగోఇటు చూశావా చెక్కిలిపై చిరుసిగ్గులు
గుండెల్లో వికసించిన మధుర లేఖ రాస్తున్నా ||

చందమామ నవ్వుతోంది నా మెరిసే మోముచూసి
వెన్నెలలో ఆ ముచ్చట మెరుపు లేఖ రాస్తున్నా ||

నిన్నలలో నిలిచానా భావాలలో నిండిపోతు
మందస్మిత లాలనతో కలల లేఖ రాస్తున్నా ||

ఓ ఊహల చెమరింపులు ఉద్వేగపు సంతకాలు
క్షణమైనా తలవలేని తలపు లేఖ రాస్తున్నా ||

అందమైన అద్భుతాలు మౌనవాణి అక్షరాలు
తచ్చాడే నీరూపం చిత్ర లేఖ రాస్తున్నా ||

నినుచూడని ఘడియల్లో నిట్టూర్పులు మోయలేను
అతిశయంపు రంగుల్లో వర్ణ లేఖ రాస్తున్నా ||
....కొరటమద్ది వాణి

సందిగ్దం ....


నియంత్రించలేని మనసు వెంట పడుతూనే వున్నామేమో
కోపము బాధ కలగలసిన మౌనానికి సర్ది చేప్పలేని నిస్సహాయత
ఎదురుచూసే సంఘటలకు స్పందన కరువైనట్లు
అర్ధం కాని సంఘర్షణే అంతా ఇపుడు

అవసరాలకు సహకరించిన సందర్భాలను
గతమైన సంగతులేవి గుర్తుపెట్టుకోలేని బంధాలను
వివక్షలతో విచక్షణ కోల్పోయిన మనుషులు
మారుతున్న ప్రవర్తనలను అంగీకరించలేని అంతరంగం
ఊగిసలాడే శ్వాసలు
ఊసూరంటున్న జీవితాలు
స్వార్ధం సంచరిస్తూ ఎవరు ఎవరికీ ఏమి కానట్లు
కదిలే కాలం కరగని మనసులు
గమనించలేని బ్రతుకుపోరాటం
మొహమాటపు పలుకరింపులు
ఆహ్లాదం మరిచిన రోజులే అన్నీ
పరుగెట్టె క్షణాలతో మనసు బందీ ఇపుడు
ఒంటరి జంటలు ఒరిగే కాయాలు
సమాజాన్ని ఉద్ధరించే వృద్ధాశ్రమాలు
కలలను మరిచిన గమనంలో
యుద్ధానికి సన్నద్ధమౌతూనే వుంది ప్రతినిమిషం
రాత్రిని చేరేందుకు ఆత్రంగా
రేపటిని పట్టుకునేందుకు ఆశగా...!!
......కొరటమద్ది వాణి
కునుకుతాకి కనుపాపకు కల ఏదో దొరికిందీ ll
నిశ్శబ్దం బద్దలౌతు పలుకేదో దొరికిందీ ll

మనసు మాలల్లల్లుతోంది మౌనవాణి ఙ్ఞాపకాలు
అక్షరాల లాలనలో శాంతేదో దొరికిందీి ll

ఓ నవ్వుల శబ్ధమేదొ నన్నుతాకి వెళుతోంది
చూపులకే వెలుగునిచ్చు కాంతేదో దొరికిందీ ll

దూరంగా వుంటోంది దగ్గరగా రమ్మంటూ
స్వప్నాలను స్పర్శించని వరమేదో దొరికిందీ ll

అభిమానపు సంపదలే అడుగంటెను నేస్తమా
భావాలకు ప్రాణమిచ్చు కలమేదో దొరికిందీ ll

కాలానికి పరదాలను కప్పివుంచ లేముకదా
ఎదురుచూపు మౌనానికి ఆశేదో దొరికిందీll
.........వాణి కొరటమద్ది

ఆర్టిఫిషియల్ లైఫ్ ...


ఇప్పుడింకా తొందరగా వుంది
రేపటిని చేరాలని
మరురోజుకు చిత్రంగా మిగిలిపోవాలనీ
ఏమీ కానట్లు నటించే మనుషుల నుండి దూరంగా
నన్ను నేను విసిరేసుకోవాలని

పెరిగే కోరికలకు బందీలౌతూ
తరిగే విలువలకు తలవంచలేక
పెంచిన బంధాలను తుంచేసుకుంటున్న
మనుషుల జాతినుండే నిష్క్రమిఃచాలని
రూపాలెన్నో కదా ఆశకు
నాది ఆశేనేమో ఇది
ఆత్మీయమైన ఆలింగనం కావాలని
మనసు మధురంగా స్పందించే సందర్భం రావాలని
ఎవరమూ ఎవరినీ నిందించలేం
ఎందుకిలా అని ఎవరికి వారే ప్రశ్నించు కోవాలిప్పుడు
మరకలంటింది ప్రేమకు కాదేమో
మారిన మనుషుల మనసులకే కదూ
జ్ఞాపకాలు పదిలంగానే మోసుకుందాం
కాస్తంతైనా తియ్యదనం అక్కడే దొరికించు కోవాలికదా
బాల్యంలో గిలికజ్జాలు పెట్టుకున్నపుడు
చురుకుగా తగిలి దెబ్బలను కూడా
మనకు మనమే ఓదార్చుకున్నాం గుర్తొచ్చిందా..?
అపుడు గాయంకూడా ఆనందాన్నే పంచింది కదా!
ఇప్పుడెందుకు కోపాలను కౌగిలించుకుంటున్నాం
ప్రతి విషయానికి మనసును తుంచేసుకుంటున్నాం
పుట్టుకకూ గిట్టుకకూ మధ్య కాస్తంత జీవనం
జీవితం నటనైపోయాక కాలం కూడా కలుషాతమౌతూనే వుంటుంది
ఆనందం అవసరంగా మారిపోయాక
రేపటిని కూడా బరువుగానే భరించాలి
మాటలన్నీ ఆర్టిఫిషియల్ గా అనిపించడంలేదు
నేచురాలిటీ కోల్పోయిన మనుషుల మధ్య..!!
......కొరటమద్ది వాణి
ముగిసిన ప్రయాణం నీది ...
విరిగిన వంతెనపై నిలిచిన గమనం నాది..!!
స్నేహంగ తీరాలు కలిపేది సాగరం ||
వాణిజ్య బంధాలు నెరిపేది సాగరం ||

కెరటాల సయ్యాట తీరాన్ని తాకుతూ
ఆనంద సందడులు పంచేది సాగరం ||

ఉప్పెనలొ ఉగ్రంగ ఊళ్ళన్ని ముంచేెను
కన్నీటి కథలెన్నొ మింగేది సాగరం ||

స్వచ్ఛంగ ముత్యాలు పూరించు శంఖాలు
ఆశ్చర్య నిధులెన్నొ దాచేది సాగరం ||

మనసంత మౌనంగ వేదనగ మారింది
ఓదార్పు ఉదయాన్ని తెరిచేది సాగరం ||

నదులతో తనచెలిమి సంధాన మౌతుంది
ఏటిలో పరవళ్ళు కలిసేది సాగరం ||

కన్నీటి నావలో తెరచాప నేనైతె
గుండెల్లొ ఘోషగా పలికేది సాగరం ||
........వాణి కొరటమద్ది
నిశీధి నిండిన మదిలో కురిసే వెన్నెల ధారా ||
ఆశలు శిఖరం అంచున కులికే వెన్నెల ధారా ||
.
నిలిచిన నీడలు కాంతులవైపుకు తరలే సమయం
మౌనం ఓడుతు వాణిని గెలిచే వెన్నెల ధారా ||

.
కన్నుల ముందుకు చూపులు వెతకని ఆశ్చర్యాలే
ఊహల తెమ్మెర బొమ్మై నిలిచే వెన్నెల ధారా ||
.
నడిచే దారికి వెలుగుపువ్వులే స్వాగత మన్నవి
నిశలే చేరని హాసం చిలికే వెన్నెల ధారా ||
.
వేదన మనసే సుఖాల తీరం చేరిందిపుడే
నవ్వుల సవ్వడి మనసున నింపే వెన్నెల ధారా ||
.
చెమ్మగిల్లినా చూపుల్లోన తడిసిన ఙ్ఞాపకం
తడిమే భావం కవితై ఒలికే వెన్నెల ధారా ||
.
.......వాణి కొరటమద్ది
చీకటిలొ అందంగ మురిసింది రాతిరి ||
ఏవేవో ఊసుల్ని మోసింది రాతిరి ||

కమ్మనీ కలలెవో విడలేను జన్మంత
గుండెల్లొ కథనాలు నింపింది రాతిరి ||

రెప్పలను తెరవాల మధురిమలు తొలగేను
మౌనంగ సందడులు పంచింది రాతిరి ||

తీయ్యనీ అలసటలు తలపంత మోయాలి
అరుదైన చెలిమితో మెరిసింది రాతిరి ||

పరవశం చిత్రంగ పరిమళం అద్దింది
ఉదయాన్ని గెలుపుగా పిలిచింది రాతిరి ||

రేయంత మూగగా నిశ్శబ్దం నెగ్గింది
ముచ్చట్లు దాచేసి మిగిలింది రాతిరి ||

మనసంత మధురమై అనుభూతి నిండుతూ
ఆనంద అమృతం గ్రోలింది రాతిరి ||
......కొరటమద్ది వాణి
నీటి సుడులను మనసు మడిలో దాచుకుంటిని ఇంతకాలం ||
ఙ్ఞాననేత్రం మూసుకొంటే తడుముకుంటిని ఇంతకాలం ||

మౌనవాణియ మూగబోయెను తంత్రితెగిన వీణవోలే
నొప్పి ఎంత సలుపుతున్నా ఓర్చుకుంటిని ఇంతకాలం ||

పట్టుతప్పిన క్షణాలెన్నో కనులనిండిన వెతలనీరే
చమురు లేని వత్తివోలే వెలుగుతుంటిని ఇంతకాలం ||

ఆశ నడపిన కాలమేదో వెనుక నిలచెను బరువుగానే
మౌన కథలను హృదయతడితొ పేర్చుకుంటిని ఇంతకాలం ||

అడుగు పెట్టిన అశ్రునీడలు నిశలు నింపుతు నిలచి వుండెను
ఎన్ని అనుభవ రాతలో మరి చేర్చుకుంటిని ఇంతకాలం ||

తరలిపోయెను కాలగతిలో తపనపడ్డ ఆశలెన్నో
కొత్త ఉదయం కొంత కోరిక గడుపుతుంటిని ఇంతకాలం ||

భావ జగతిలో పరుగుపెట్టే నడకలెన్నో నేర్చుకుంటూ
గతం నిలిపిన గాధలన్నీ కూర్చుకుంటిని ఇంతకాలం ||
.......వాణి కొరటమద్ది
ఊపిరాగి పోతే నా ఉనికైనా ఉండనీ ||
గమనమాగి పోతే ఓ గెలుపైనా ఉండనీ ||

చీకటికే చిరునవ్వులు కానుకగా ఇచ్చేస్తే
చెక్కిలిపై ఆ మెరుపుల మరకైనా ఉండనీ ||

కన్నీళ్ళతొ కవనాలను బంధించే ఉంచానా
కావ్యంలో నాయికగా కాంతైనా ఉండనీ ||

రెప్పలపై తడితలపులు చెరపలేక పోతున్నా
నిదురించే కనుపాపకు సొగసైనా ఉండనీ ||

స్వప్నాలే మెలుకువపై అలిగి వెళ్ళి పోయాయా ?
కలలలోన మురిపాలను క్షణమైనా ఉండనీ ||

నిశీధిలో మధురమైన భావంగా మిగిలానా ?
మౌనవాణి పదములలో వెలుగైనా ఉండనీ ||
......వాణి కొరటమద్ది
నిష్క్రమించి నావుకదా నీడేదీ దొరకలేదు ||
నినుచేరగ తెరుచుకున్న తోవేదీ దొరకలేదు ||

స్మృతులెన్నో మిగిలాయి స్పర్శ వెతుకుంటున్నా
నీ ముచ్చట మౌనమాయ పలుకేదీ దొరకలేదు ||

రెప్పలపై తచ్చాడుతు కలలలోని ఆ దృశ్యం
వేకువలో మరిచానా ఉనికేదీ దొరకలేదు ||

కెరటాలను చూస్తున్నా తీరాలను తడుపుతోంది
నే గీసిన చిత్రాలకు ఋజువేదీ దొరకలేదు ||

గుండెల్లో గుబులెందుకు కలచెదిరిన కథ ఏమిటొ
మదిలోతులు చదివెెందుకు దారేదీ దొరకలేదు ||

చీకటిలో చిరునవ్వును దాచాలని లేదులే
తడిమబ్బును తొలగించే తలపేదీ దొరకలేదు ||

మనసంతా చిన్నబోయి మూగగానె మిగిలింది
మౌనానికి మాటనేర్పు భాషేదీ దొరకలేదు ||

అదిగో అటు చూడంటూ మిణుకువేదొ తళుకుమంది
చూపువెతుకు దారుల్లో ఆశేదీ దొరకలేదు ||
......వాణి కొరటమద్ది
శబ్ధ స్వర భంగిమలో కురిపించెను భావాలను ||
ప్రకృతెంత పరవశమో పలికెంచెను భావాలను ||

వసంతమే రాగమైతె రంజిల్లద మనసంతా
తేజరిల్లు ప్రృధ్విపైన నర్తించెను భావాలను ||

ఆమని ఓ అపురూపం సృష్టే ఒక ఆశ్చర్యం
వనమంతా పులకించగ మ్రోగించెను భావాలను ||

అతిశయమే అభినయాలు నవరసాల రూపాలు
తనహస్తపు ముద్రలతో చిత్రించెను భావాలను ||

జయదేవుని అష్టపదులు విరచించిన గమకాలు
మువ్వలసడి మర్మంగా వినిపించెను భావాలను ||

తుమ్మెదలా తచ్చాడుతు మయూరాన్ని మరిపించెను
మరందంల మధురంగా రవళించెను భావాలను ||

ఆకాశం మురిసింది మెరుపులతో దీవిస్తూ
పంచభూతాలవింత వర్ణించెను భావాలను ||
.....కొరటమద్ది వాణి
శబ్ధ స్వర భంగిమలో కురిపించెను భావాలను ||
ప్రకృతెంత పరవశమో పలికెంచెను భావాలను ||

వసంతమే రాగమైతె రంజిల్లద మనసంతా
తేజరిల్లు ప్రృధ్విపైన నర్తించెను భావాలను ||

ఆమని ఓ అపురూపం సృష్టే ఒక ఆశ్చర్యం
వనమంతా పులకించగ మ్రోగించెను భావాలను ||

అతిశయమే అభినయాలు నవరసాల రూపాలు
తనహస్తపు ముద్రలతో చిత్రించెను భావాలను ||

జయదేవుని అష్టపదులు విరచించిన గమకాలు
మువ్వలసడి మర్మంగా వినిపించెను భావాలను ||

తుమ్మెదలా తచ్చాడుతు మయూరాన్ని మరిపించెను
మరందంల మధురంగా రవళించెను భావాలను ||

ఆకాశం మురిసింది మెరుపులతో దీవిస్తూ
పంచభూతాలవింత వర్ణించెను భావాలను ||
.....కొరటమద్ది వాణి
జ్ఞాపకాన్ని బంధంగా మోసినదీ మానసమే ||
తలపులన్ని భావాలుగ మలిచినదీ మానసమే ||

అంతులేని కోరికలే అవధిలేని స్వార్ధాలే
శిక్షలన్ని మనసుకైతె కుమిలినదీ మానసమే ||

చెదురుతున్న జీవితాలు అందలేక ఆత్మీయత
ధనమే మన గమనమైతె రగిలినదీ మానసమే ||

గుండెల్లో గుబులైనది గుర్తు మరిచి పోలేను
కన్నుల్లో చెమరింతను చిలికినదీ మానసమే ||

మనుగడెంత బరువైనదొ విలువలన్ని వెలసిపొయి
మనిషితనం జాడకొరకు వెతికినదీ మానసమే ||

మౌనానికి తలవంచక తప్పలేదు చూశావా
అహంకార ముసుగుచూసి తడిచినదీ మానసమే ||

మధురవాణి నిశ్శబ్దాన్ని నెగ్గలేక పోయిందే
సహనానికి సహవాసం నేర్పినదీ మానసమే ||
.....కొరటమద్ది వాణి

ఆసరా.....


మరకలు అంటుకున్న మనిషితత్వం
శిధిలమైపోయిన మానవత్వం
అనుబంధాలు ఆనవాళ్ళుగా మిగిలి
అతిశయమే ఇపుడు మంచితనాలు
ఆపదలకు ఆసరా ఆశించలేని ఏకాకి జీవితాలు
గుండెకెంత గాయమైనా ఊపిరిని ఉగ్గపట్టాల్సిందే
మనసులు డబ్బుకు దాసోహమయ్యాక
ఉనికికై వెంపర్లాడాల్సిందే
ముసలితనం ఆశ్రమాలకు అంకితమయ్యాక
ఆసరా కోల్పోయిన అవసాన ముగింపులే
ఆశను కునుకు కాపలా పెట్టాక
రాత్రీ పగలు లెక్కలోకి రానివే
ఆసరా కోల్పోయిన అలసటలు
స్వార్ధం ముసుగులో సర్దుకుపోవాల్సిందే
చిరునవ్వులు నిజాయితీని కోల్పోయాక
అరువైన నగవులు అతికించుకోవాల్సిందే
ఙ్ఞాపకానికి గమనానికి మధ్య గమనించలేని
గజి బిజి క్షణాలెన్నో
స్వప్నాలకు నిజాలకు సర్దిచెప్పలేని అసహాయతలే
ఊహలు వాస్తవాలలో ఓడుతున్న వైనాలే
నాలుగు గోడల మధ్య బందీలౌతూ
సంక్షిప్త సందేశాలతో అంతరంగాలన్నీ
అంతర్జాలలోకంలో అంతుచిక్కని ఆశయాల సాధనలే
నిర్మలత్వం నివ్వెర పోయాక
నిశీధిలో నిశ్శబ్ద చింతనలే
ఆశపడే ఆత్మీయతలు అందలమెక్కాక
అనుబంధాలన్నీ ఆసరా కోల్పోతూనే వుంటాయి
ఒంటరితనాలు ప్రతిబంధకాలౌతూ....!!
........వాణి
చదువులమ్మ చెట్టునీడ కావాలని ఉన్నదీ ॥
ధనములేమి తనము కాస్త తొలగాలని ఉన్నదీ ॥

బడులెన్నో ప్రతి వీధిలొ బడుగుబాలలోడిపోతు
మనసుసైన మాష్టారునే పొందాలని ఉన్నదీ ॥

అందమైన భవంతిలో అదిగో అది పాఠశాల
నేనక్కడ విద్యార్ధిగ చదవాలని ఉన్నదీ ॥

మిక్కిలైన ధనకాంక్షలు విద్యకూడ వ్యాపారమె
అక్షరాన్ని నేనౌతూ నేర్వాలని ఉన్నదీ ॥

నేతలార శ్రోతలార తెలియలేద మా గోడులు
ఆ వాణీ దీవెనతో మెరవాలని ఉన్నదీ ॥

పసితనాలు బందీలే మా బాల్యం పనిలోనే
మా హక్కును మేముకూడ గెలవాలని ఉన్నదీ ॥

కూలివాని బతుకులోన కాంతిఎపుడు వస్తుందో
అవినీతికి చరమగీతి పాడాలని ఉన్నదీ ||
.....వాణి కొరటమద్ది
మౌనమెందుకు మదినదాగిన మర్మ మెమిటో చెప్పలేవా..?
చెమ్మగిల్లిన కనులమాటున కలత ఏమిటో చెప్పలేవా..?

వణుకుతున్నవి పెదవులెందుకు వెతుకుతున్నవి చూపులేమిటో
గొంతు పెగలని సహనమెందుకు గాయమేమిటో చెప్పలేవా..?

రాలిపడినవి పువ్వులక్కడ వడలి పోయెను మనసు ఇక్కడ
చిత్రమైనది ఓటమెందుకు చింత ఏమిటో చెప్పలేవా..?

వింత వింతగ బ్రహ్మరాతలు వీడలేనివి ఆత్మ బోధలు
పంచుకో చెలి తుంచగలుగుదు తపన ఏమిటో చెప్పలేవా..?

నీవు అక్కడ నేను ఇక్కడ స్పర్శ కోరని స్నేహమెందుకు
స్వప్నమేదో సత్యమేదో నిజము ఏమిటో చెప్పలేవా..?

మధురవాణియ మూగబోయెను అలసిపోదే అలుకు ఎందుకొ
చుట్టుముట్టెను నిశలు నిధులై ఘర్షణేమిటో చెప్పలేవా ..?
......కొరటమద్ది వాణి

నిరీక్షణ...


చీకటో వెలుతురో అర్ధం కాదు
కునుకుకీ మెలుకువకీ మధ్య నీ కోసమే నిరీక్షణ
స్వప్నంలో ఆక్రమిస్తావో
నిజంలో నాతో వుండిపోతావో ...
తెలియలేని అయోమయం
నిష్క్రమించిన నీ కోసం నిరాశ మోసే ఎదురుచూపు నాది

పగలు రేయి పలుకరించి వెళుతూనే వున్నాయి
నీ పలుకులు ఆలాపనలే అవుతుంటాయి
కలవరంగ కన్నీళ్ళను మింగేస్తూ
పలవరంగా వణికే పెదవులు బిగబడుతూ
వెలుగులున్నా చీకటి సంచారమే
మనసుకు దగ్గరగగా స్పర్శకు దూరంగా
ఆశల కొసకు వెలాడే అంధకారాన్ని నేను
నీ చివరి ప్రయాణానికి నేనెందుకు సాక్ష్యమవ్వాలి
అమాయకంగా మిగిలిన ఆసమయాన్ని నేనెలా మర్చిపోవాలి
ఏ దేవుడిని ప్రశ్నించలేని అసమర్ద వేదనే అప్పుడు
అశ్రుధారలు అర్పణచేస్తూ నన్న నేను అవనతం చేసుకోవలసిందే
బలమైన కారణాలకు బందీని చెసుకుంటూ
బ్రతుకుయుద్ధంలో బలి అవుతూ
నిశ్శబ్దాన్ని నిలువరించలేక
శబ్దాన్ని ఆస్వాదించలేక
ఆయువునివ్వలేని అమ్మగా
నువ్వు చేరువయ్యే క్షణం కోసం నిరీక్షణ ....!!
.........కొరటమద్ది వాణి
ఆత్మీయత అవసరాల చెలిమిలాగ మారింది ||
స్వార్ధమే మనుష్యుల్లో కలిమిలాగ మారింది ||
.
క్షణముకంటె వేగంగా మనసుపరుగు పెడుతుంది
కదలకుండ ఆగలేని గాలిలాగ మారింది ||

.
మాటలన్ని కప్పుకుని మౌనంగా మిగిలాయి
జీవితమే యాంత్రికమై నటనలాగ మారింది ||
.
చూపులన్ని చిత్రంగా నిరాశతో నలిగాయి
బలవంతపు ఆశేదో ములుకులాగ మారింది ||
.
వింతగానె సాగుతోంది విధిలేక కాలమంత
మోహమాటపు స్పర్శలతో మిణుకులాగ మారింది ||
.
మధురమైన పలుకులేవి మౌనవాణి పిలుపుల్లో
నవ్వులేవి పెదవుల్లో వగపులాగ మారింది ||
.......వాణి కొరటమద్ది
తెరమాటున పలుకరించు మౌనమెంత బాగుంది ||
సైగలతో ననుతాకే చూపుఎంత బాగుంది ||

లేలేతపు వెలుగులలో సఖునికై ఎదురుచూపు
పలుకరింపు వేకువలో ఆశ ఎంత బాగుంది ||

కదలాడే పెదవులలో పలుకులేవొ తెలియదూ
వణుకుతున్న పెదవులలో కులుకుఎంత బాగుంది ||

నిన్నరేయి అలసటలే నీవదనం చెపుతోంది
కంటికింద నీడలలో అందమెంత బాగుంది ||

పైటచాటు నీమోమున పసిడికాంతి చూస్తున్నా
కనులతోన కనులుకలుపు కబురుఎంత బాగుంది ||

మూసివున్న రెప్పలలో కధలెన్నో దాచావు
నిశ్శబ్దపు నీమౌనం 'వాణి'ఎంత బాగుంది ||
............వాణి కొరటమద్ది
దుఃఖాలను చీకటెలా మోసిందని అడగొద్దు ||
తడిమరకలు వెలుతురెలా తుడిచిందని అడగొద్దు ||

కలవరమై పోతున్నా కలలకొరకు తపియిస్తూ
స్వప్నాలను వేకువెలా చెరిపిందని అడగొద్దు ||

అనుబంధం ఆత్మీయత అలసి పోతువున్నాయా..?
బంధాలకు బలిమిఎలా తరిగిందని అడగొధ్దు||

ఊహించని గాయాలకు శిక్షనెలా మోయాలి..?
నమ్మకాన్ని మనసు ఎలా నెగ్గిందని అడగొద్దు ||

ఎదురయ్యే బాటలలో సవాళ్ళెన్ని పిలిచాయో
అడుగడుగున మౌనమెలా గెలిచిందని అడగొద్దు ||

చిరునవ్వుల చెలిమి ఏల చేెజారుతు వున్నదో
చెక్కిలిపై అలక ఎలా కలిగిందని అడగొద్దు ||
......వాణి కొరటమద్ది

తేటగీతి ...


మౌన మది యంత మధురమే మర్మ మేమి
తలపు తెర తీసి తడిమి నే తడిసిపోతి
మనసు గెలిచిన మురిపాల మహిమ లెన్నొ
చిత్తమంతయు చిత్రించి చిత్రమౌదు..!!

......వాణి కొరటమద్ది

తేటగీతి .....


కరగి పోయెను కాలమ్ముఁ కరుణఁజూడు
పొంగి పొరలె హృదయమంత పొగిలి పొగిలి
పలుకు రాక పదములమాలలు తుంటి
దయన దరహాస వరముకై దారినిమ్ము.!!

......వాణి కొరటమద్ది
 
అలసిపోని ఆనందపు కెరటముంది నీలోనే ||
దుఃఖాలకు తెరవేసే ధైర్యముంది నీలోనే ||
.
నిన్నలెంత నిశలైనా మదిలోతున వెలుగులెన్నొ
స్వప్నాలను స్వాగతించు స్వర్గముంది నీలోనే ||

.
మౌనంలో కాలమంత కవనంగా మారిందీ
అక్షరమై అల్లుకున్న కావ్యముంది నీలోనే ||
.
అదుపులేని ఆవేశం చెరిగిపోని సంతకం
అంచలమును అధిగమించు శాంతముంది నీలోనే ||
.
అంతరంగ అలజడిలో హృదయంతో సంభాషణ
నిశ్శబ్దాన్ని నిలదీసే నేస్తముంది నీలోనే ||
.
మౌనవాణి మమకారపు భావాలతొ సావాసం
కలవరాలు కరిగించే సారముంది నీలోనే ||
.
..........వాణి కొరటమద్ది

తేటగీతి....


మనసు మర్మమే మౌనమై మాట రాక
నిన్న గాయము సలుపునే నిధిగ మిగిలి
గతిని మార్చెనే గుబులుగా గమన మందు
దుఃఖము బరువై కాలము దున్న లేక..!!

.....కొరటమద్ది వాణి
మౌనానికి బాసటగా మిగులుతూనె ఉన్నానూ ||
మనసునొచ్చు గాయంగా నలుగుతూనె ఉన్నానూ ||

అందమైన భావాలకు మెరుగులద్దుతున్నాను
అరుదైనవి కవనాలను అల్లుతూనె ఉన్నానూ ||

చీకటింట చిరునవ్వులు జారిపడి పోయాయా
మిణుగురునై అడుగడుగున వెతుకుతూనె ఉన్నానూ ||

రేయంతా మెలుకువతో కలలు మరిచిపోయానూ
తూరుపునై తిమిరాలను తరుముతూనె ఉన్నానూ ||

కఠిమైన క్షణాలన్ని కన్నీటిని కురిశాయి
నిశ్శబ్దాన్ని ఓదార్చుతు నిమురుతూనె ఉన్నానూ ||
.....వాణి కొరటమద్ది

తేటగీతి....


కలత పడెను కృష్ణ మనసు కలవరముతొ
కలలు కరువాయ కన్నీరు నిండి పోతు
కనులు మూయదె రాతిరి కథలు మరచి
కరగదేమిటి చీకటి కాంతి నిండి...!!

......కొరటమద్ది వాణి
చీకటలను తొలగించే వెలుగు కదా గురువంటే||
అడుగడుగున దారిచూపు గెలుపు కదా గురువంటే ||

విద్య తోన వివేకాన్ని నేర్పుతున్న గొప్పతనం
మృదువుగానె దండించే స్ఫూర్తి కదా గురువంటే ||

అక్షరాన్ని ఆశయాన్ని మనసంతా నింపేస్తూ
రేపటికై నడకనేర్పు మెరుపు కదా గురువంటే ||

విజ్ఞానపు వికాసంతొ బ్రతుకుదారి చూపుతూ
జీవితాన్ని మలచుకునే పిలుపు కదా గురువంటే||

తపనలెన్నొ మనిషిలోన అలజడౌతు అర్ధమవక
గమ్యమేదొ గమనమేదొ తెలుపుకదా గురువంటే ||

సహనమౌను ఆలోచన ఆచార్యుని బోధనతో
మన బాటలొ జ్ఞాన కాంతి పంచు కదా గురువంటే||

బ్రతకంతా నిండుతూ రంగులతో నింపుతూ
జ్ఞాననిధిని కానుకిచ్చు వేల్పుకదా గురువంటే||

అహంకార మణిచేసే అధ్వైతపు నీడలలో
శాంతి జీవ అమృతాన్ని నింపుకదా గురువంటే ||
.....కొరటమద్ది వాణి
కనిపించని గాయాలను చూపలేను నేస్తమా ||
గుండెలోని దుఃఖాలను చెరపలేను నేస్తమా ||

ఆవిరవదు ఆలోచన అలసిపోని సంఘర్షణ
మనసులోని మర్మాలను తుడవలేను నేస్తమా ||

జ్ఞాపకాలు మదిని విడచి మరలి వెళ్ళ లేవులే
తడి తలపుల జాడలవి విడువలేను నేస్తమా ||

అంతులేని ఆవేదన అక్షరమై ఒలుకుతుంది
గతమైనవి చిరునవ్వులు చేరలేను నేస్తమా ||

కలతలన్ని కన్నీళ్ళలను చిలుకుతూనె ఉన్నాయి
కాలమెంత కరుగుతున్న ఆపలేను నేస్తమా ||

మౌన వాణి మానసమే భావాలకు తోరణమే
అలజడులను రెప్పలపై దాచలేను నేస్తమా ||
.....కొరటమద్ది వాణి
కంటిపాపే చీకటైనది కాంతి ఏమిటి చేయగలదూ ||
కలల ఓటమి కావ్యమైనది కాల మేమిటి చేయగలదూ ||

జ్ఞాపకాలది దృశ్యకావ్యం ఉహరాల్చిన వర్ణచిత్రం
అమ్మ భాష్యం గుండెపలికెను కుంచెఏమిటి చేయగలదూ ||

మమత కోరిన హృదయఘర్షణ ఆశ పడెనది ప్రేమ స్పందన
స్నేహహస్తం వెంటవుండిన ఆపదేమిటి చేయగలదూ ||

కంటితడులకు కానుకిస్తూ మనసు మాలలు అల్లుతున్నది
అశ్రు వర్షం నిగ్రహించిన కలతఏమిటి చేయగలదూ ||

ఓడిపోయిన సంతసాలకు భావమేఘం తోడు నిలచెను
కవనజగతిలొ సంచరిస్తే దు:ఖమేమిటి చేయగలదూ ||

చరిత్రంతా వేదనైనా గమన గతులను ఆపలేమే
ఉదయ రాగం స్వాగతించిన తిమిరమేమిటి చేయగలదూ ||

చూపు తెరలకు కొత్తవేకువ శాంతి మంత్రం ఆలపించెను
మనో వ్యధలకు మురిపె మద్దిన గాయమేమిటి చేయగలదూ ||

అంతరంగం అలసిపోయెను మధురవాణిది మౌనలాస్యం
విషాదముతొ చెలిమి యుద్ధం శోకమేమిటి చేయగలదూ ||
.
..........వాణి కొరటమద్ది
పువ్వుల్లొ చిరునవ్వు పేర్చేము బతుకమ్మ
పండుగలొ హాసాలు నింపేము బతుకమ్మ

బ్రతుకంత నవ్వుల్ల వరమడిగ మ్రొక్కాము
నినుకొలువ సంబరం నిండేను బతుకమ్మ

పాటలతొ ఆటలతొ సందడే చేశాము
కోలాటమాడుతూ కులికేము బతుకమ్మ

అందంగ సుమముల్లొ నిను చూసి మురిశాము
కుసుమంలొ నీరూపు మెరిసేను బతుకమ్మ

బంధాలు గట్టిగా నిలబెట్ట మంటున్నా
కలసిమెలసి జన్మంత సాగేము బతుకమ్మ

వెన్నెలలు నింపమ్మ బంగారు బతుకమ్మ
ఆనంద పరిమళం పంచేము బతుకమ్మ
..వాణి కొరటమద్ది
గాయమైన రేతిరెలా తడిచిందని అడగకూ ll
కన్నీటిని వేకువెలా తుడిచిందని అడగకూ ll

నిశ్శబ్దం నిర్దయగా నన్ను విడిచి పోలేదు
గుర్తులలో చీకటెలా చేరిందని అడగకూ ||

నిదురించని రేయంతా నీ కోసం ఆరాటం
జ్ఞాపకాన్ని మనసుఎలా మోసిందని అడగకూ ll

నాకు నేను అర్ధమైన క్షణమొక్కటి లేదుకదా
నిన్నలలో కాలమెలా గడిచిందని అడగకూ ll

నిట్టూర్పుల గాలులలో కనిపించదు ఆవేదన
గుండెలయతొ మౌనమెలా పలికిందని అడగకూ ll

నిశీధిలో నిలచున్నా వెలుగువైపు చేరలేక
దూరంగా మిణుకువెలా మెరిసిందని అడగకూ ll

తిమిరాలలొ తడుస్తూనె కలలు వెతుకుంటున్నా
చిరునవ్వుకు ఓటమెలా కలిగిందని అడగకూ ll

.........వాణి కొరటమద్ది
ఎదురు చూపుల ఆశ ఇంకా సమసి పోలేదు ||
జ్ఞాపకాలే మౌనమదిలో వడలి పోలేదు ||

మమత దాచిన అమ్మ తనమే మనసు నిండా
రెప్పపైననే కంటితడులు ఇగిరి పోలేదు ||

చెమరించే చెరపలేని గాయపుమరకలు
గుండె పగిలిన దృశ్యమింకా చెరిగి పోలేదు ||

అక్షరాలుగ రాసి పోసిన కంటిచుక్కలు
తిమిరనదులను ఈదుతున్నా తరిగి పోలేదు ||

నిష్క్రమించిన నిన్నుతలచుతు నిదురమరిచాను
బాధ నంతా భావమల్లుతు అలసి పోలేదు ||

విధిని నెగ్గుట సాధ్యమౌనా నిన్ను చేరే దారిలో
కాలమెంతగ కదులుతున్నా మరిచి పోలేదు ||

గగనమంతా నీదె అయినది గమనమాగిపోయెనె
ఊహలన్ని నీతో నిండి నా ఊపిరాగి పోలేదు ||
నీ నవ్వుల మెరుపులలో నాకు చోటు ఇస్తావా ||
మధురూహల మౌనంలో నాకు చోటు ఇస్తావా ||

జలధారను పరికిణీగ చుట్టుకుంది నీవేనా?
కొత్తందపు రంగులలో నాకు చోటు ఇస్తావా ||

నీ పాదపు కదలికలలొ ఉల్లాసం చూస్తున్నా
ఆనందపు క్షణాలలొ నాకు చోటు ఇస్తావా ||

నీ చూపుల తాకిడిలో మనసుజార్చు కుంటున్నా
నీ లాస్యపు భంగిమలలొ నాకు చోటు ఇస్తావా ||

నీ వలువలు విసురుతున్న జడిలో నే మురుస్తున్న
తడుస్తున్న నీ తలపులొ నాకు చోటు ఇస్తావా ||

కదలాడే పెదవులలో ‘వాణి’ ఏదొ తెలుపవా?
ఆ పలుకుల పదనిధిలో నాకు చోటు ఇస్తావా ||
………..వాణి కొరటమద్ది
చిరునవ్వుల చినుకులలో తడిశానా ఎపుడైనా ||
కలలతోన కనుపాపను తడిమానా ఎపుడైనా
.
మౌనగాన మాధురిలో గాయాలే మానునులే ||
సంతసాల మెరుపులలో మునిగానా ఎపుడైనా ||

.
కలతతడితొ మనసుమడిలొ చెమ్మగిల్లిన చరితలే
అనుభూతులు అద్దంలో చూశానా ఎపుడైనా ||
.
గుండెగూటి వేదననే భారమై మోయలేక
మదిన మెదులు భావఝరులు దాచానా ఎపుడైనా ||
.
అందమైన అవనిలోన జీవితమే వరముకదా
పూవ్వల్లే పరిమళిస్తు విరిసానా ఎపుడైనా ||
.
తిమిరాలలొ తచ్చాడెను మధురవాణి మౌనమౌతు
నిదుర ఒడిలొ స్వప్నాలను గెలిచానా ఎపుడైనా ||
.
కొత్తబాట కొంతతృప్తి నిశలులన్నీ చెరిగిపోతె
పూలబాట కావాలని కోరానా ఎపుడైనా ||
.
.....వాణి కొరటమద్ది
ఆత్మీయత అలసి పోయి దూరం అయ్యిందా ?
అనుబంధం ఉనికి మరిచి మాయం అయ్యిందా ?

జ్ఞాపకాల పయనంలో మనసు నిలచి పోతోంది
అనుభూతుల సంచారం సాయం అయ్యిందా ?

అంతరంగ మదనంలో ఆత్మ స్మర్శ తెలిసింది
శూన్యంతో చెలిమెందుకొ అర్ధం అయ్యిందా ?

మాటలన్ని మౌనంలో బందీ అయిపోయె కదా
అంతరంగ పయనమిపుడు త్యాగం అయ్యిందా ?

నటనలోనె జీవితం నవ్వు మెరుపు మరిచింది
గుండెను మెలిపెట్టు కథ భారం అయ్యిందా ?

మధుర వాణి ఆశయాల రెక్క విరిగి పోయిందే
కన్నీళ్ళను దాచలేక తిమిరం అయ్యిందా ?

......కొరటమద్ది వాణి
ఊహల్లొ ఊసులే చెప్పేది మౌనం ॥
భావాలు రాసిగా పోసేది మౌనం ॥

అనుభూతి అద్దమో కన్నీటి కాలమో
జ్ఞాపకం తాకుతూ తడిమేది మౌనం ॥

కలలన్ని కథలుగా కూర్చుకుంటూనే
తిమిరాన్ని తరచుగా తాకేది మౌనం ॥

చిలిపితనం చిత్రాలు బాల్యాల చెలిమి
చిరునవ్వు చెక్కిలిని చుట్టేది మౌనం ॥

విజయమో ఓటమో గుర్తుగా మిగిలి
ఓ స్మృతిని మదిలోన తలచేది మౌనం ॥

బంధాల మాధుర్యం మరుగైన కాని
మధురంగ ఎదలోన గుచ్చేది మౌనం ॥

పరిణయం ప్రణయం పరవశం కాదా
ఓ మధుర మధువునే గ్రోలేది మౌనం ॥

తడిస్పర్శ గుండెలో చెమరించు కనులు
ఓ బాధ బరువుగా తడిపేది మౌనం ॥
....వాణి ,

అర్ధం కానిదే...


అవగాహన లేని ఒప్పందాలే అప్పుడన్నీ
ఆత్మే సాక్షి ఆనాటి ఆత్మీయతలకు
నమ్మకం లేని రక్తబంధాలుంటాయని
ఆలస్యంగా అర్ధమౌతుంది

తట్టుకోలేని బాధ
గుండెకు గాయమయ్యాక
ఏమార్చుకోలేని అసహాయత
ఆప్యాయతలు గుజ్జెనగూళ్ళలా కూలిపోతుంటాయి
ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడని
అనుభవం నేర్పేదాకా అర్ధం కాదు
చుట్టూ విశాల ప్రపంచం వున్నా
విశాల హృదయం అరుదుగా కనిపిస్తుంది
చీకటి చుట్టమై అక్కున చేర్చుకుంటూ
గాయాలు ఓదార్చుకోమంటూ
ఆలోచన అల్లుకుంటూనే వుంటుంది
ఆశ ఇంకా అణగారిపోని ఆయుధమే
రేపు వెలుగు ఇచ్చే ఇంధనమే
కల కలవరపెడుతూనే వుంటుంది
కోరిక తీరే దాకా
మనసు కలత పడుతూనే వుంటుంది
గెలుపును హత్తుకునే దాకా
సందిగ్దం సమస్యగా మారి
రోజును బరువుగా సాగనంపుతుంది
అవకాశం అందరికీ అందుబాటుగా వుండకపోవచ్చు
ఆధారపడ్డం అనేది ఒక్కోసారి
సుడిగుండంలో ఇరుక్కున్నట్లుగా
ఉక్కిరి బిక్కిరి చేస్తూనే వుంటుంది..!!
......వాణి కొరటమద్ది

కల 'త...


మురిసిన ఆ క్షణాలింకా
మనసు వాకిట్లో మసలుతున్నాయి
కరిగిన కాలంలో కలతపడిన
ఘటనలింకా కదలాడుతున్నాయి
మమతగా హత్తుకుని మధురంగా తడుముకుని
అమ్మతనాన్ని ఆస్వాదించిన ఆ ఆనందం
జ్ఞాపకాల చట్రంలో చిరునవ్వులు ఇరుక్కు పోయి
దుఃఖంతో దోబూచులాడుతోంది గమనం
విధిని ఎదురీదలేక మిగిలింది తనువు
అనుభూతులు చెరిపెయ్యలేక నలిగేది మనసు
అశ్రువులు రాల్చుకుంటూ నిశ్శబ్దం నిలదీస్తూనే వుంది
మాతృత్వం మౌనంగా రోదిస్తూ..!!
చీకటిగా మిగలాలని అడిగానా ఎపుడైనా ?
వెన్నెలగా మురవాలని అడిగానా ఎపుడైనా ?

కన్నీళ్ళని తుడుచుకుంటు కరుగుతోంది కాలమిలా
భారంగా బ్రతకాలని అడిగానా ఎపుడైనా ?

ఆశయాల పయనంలో అలసట మరిచేస్తున్నా
గగనంలో నడవాలని అడిగానా ఎపుడైనా ?

గుండె దాచుకున్న కథలు గుట్టు గానె వున్నాయి
మౌనాలని చీల్చాలని అడిగానా ఎపుడైనా ?

మరణం ఒక దీవెనగా మారుతోంది ఆశగా
కలతలలో కరగాలని అడిగానా ఎపుడైనా ?

జీవితమొక దుఃఖమని హాసం ఒక వరము అని
చిరునవ్వులు చిలకాలని అడిగానా ఎపుడైనా ?

.......వాణి కొరటమద్ది
బాల్యం ఇంకా మురిసి పోతూనే ఉంది
పుట్టినరోజున నాన్న తెచ్చిన కొత్త గౌను
అమ్మ అందించిన పాయసం
జ్ఞాపకంగా సంతోషాల సందడి చేస్తూనే ఉంది
నిన్నల్లో నిలిచి పోయిన సంగతులెన్నో
రేపటి రెక్కలు తొడుక్కుంటూనే ఉన్నాయి
గాయమైన గుర్తులు గుండెనొదలి పోనంటూ మారాం చేస్తున్నా
అరుదుగా దొరికిన ఆనందాలు కూడా
నిశల నిధులై కప్పి పెడుతూనే ఉన్నాయి
బాధలు రాల్చిన భావాలన్నీ
అక్షర వర్షమై కురుస్తూ
కన్నీళ్ళు మానసాన్ని చుట్టుముట్టినా
ఓదార్చే కవనం అందాన్ని హత్తుకుంటూనే ఉంది
అమ్మ పంచిన అనురాగాలు
నాన్న నేర్పించిన ఆత్మస్ధైర్యాలు
జీవితం నేర్పిన పాఠాలెన్నో
మరలే సంవత్సాలతోపాటూ
నడకను నేర్పూతూనే ఉన్నాయి
ప్రతిరోజు కొత్తగా
రేపటిలోకి తొంగి చూస్తూనే ఉంటుంది
సంతోషమైనా దుఃఖమైనా
కాలానికి ఒక్కటే భావన కదూ..!!

నిట్టూర్పు


కదిలి పోతోంది కాలం నువ్వు లేకుండా
ఓ నవ్వు లేకుండా
జీవం ఆశను అంటిపెట్టుకునే వుంది
బాధ్యతగానో బంధంగానో
నిన్నలన్నీ లెక్కగానే వున్నాయి
సంవత్సరాల చరిత్రగా మిగులుతూ
గతమైన వడలిన రోజులు
గాయాలుగా మారాయి
చెరపలేని మరకలెన్నో
జ్ఞాపకాలుగా రోదిస్తూ ..
ఓడిపోయే ఎదురుచూపులు
చెరువ కాలేని ఎడబాటులు
నీ ఆలాపనలేవో వినిపిస్తూ
ఎదగని నిన్ను గుర్తులుగా మోస్తూ
పరిపక్వతలో నీ పరిపూర్ణ రూపాన్ని ఊహిస్తూ
ఇదిగో ఇలా సంవత్సరాలు దాటుతున్నాయి
వేదనలో నీవున్నావు
ఓదార్పులో నువ్వే కనిపిస్తావు
గడపలేని ఈరోజు దొర్లుకుంటూ వెళుతోంది
ఆశపడని రేపటిని ఆహ్వానించక తప్పడంలేదు
చిరకాలం నావెంట వుంటావని తలపించా
'చింటూ' నీవు చిరంజీవనే అనుకున్నా
చిన్న కోరికకూడా అత్యాసే అయ్యింది
నీ అంతిమ శ్వాస ఆపలేని నిస్సహాయత నాది
విషాద నిట్టూర్పుగా.!!
...వాణి

కావాలని


అలిగి వెళ్ళి పోయాయి అక్షరాలు
అలసిన మనసుకు ఓదార్పునివ్వలేక
మౌనమైయ్యింది మానసం
అంతరంగ లోతుల్ని అందుకోలేక
చీకటి నిట్టూరుస్తోంది
శూన్యం శత్రువైయ్యిందంటూ
అలజడి ఏమిటో అర్ధం కావడంలేదు
అంతుచిక్కని అంతఃసంఘర్షణ
బాధకు బంధువునే ఎప్పుడూ
బంధాల ముసుగును తొలగించలేక
ఎన్ని చిత్రాలో బ్రతుకులో
విముక్తి కాలేని వింత గమనాలు
కాలానికి బానిసనే
కదలక తప్పని అడుగులతో
ఇప్పుడు కొన్ని అక్షరాలు కావాలి
కన్నీళ్ళు తుడుచుకోవాలి..!!
.....వాణి
ఓ కాంతి రేఖగా మెరవనీ నీ ఎదుట ||
ఓ వెలుగు పూవుగా మురవనీ నీ ఎదుట ||

నింగంత పరచున్న మేఘాల మాలగా
ఓ సలిల ధారగా కురవనీ నీ ఎదుట ||

నులివెచ్చ వేకువలొ నీ ప్రేమ పిలుపుతొ
ఓ నవ్వు తెమ్మెరగ మిగలనీ నీ ఎదుట ||

రేయంత మురిపించె స్వప్నాల సందడి
ఓ కలల రాణిగా వుండనీ నీ ఎదుట ||

వసంతం నింపిన చిగురాకు తరువుల్లొ
ఓ రాగ కోయిలగ పాడనీ నీ ఎదుట ||

మౌనంగ మెరిసేటి నీ వలపు తలపులో
ఓ మదుర ‘వాణి’గ పలుకనీ నీ ఎదుట ||
...............వాణి ,
దుఃఖాల పరదాలు తీసేసి వెళ్ళు ||
కాసిన్ని హాసాలు విసిరేసి వెళ్ళు ||

శోధించు ఆశలో కంటినే తాకవా
చూపుల్లో కాంతుల్ని నింపేసి వెళ్ళు ||

కన్నీళ్ళు కురిసింది లోతుల్లొ ఙ్ఞాపకం
అనుభూతి అందాలు పంచేసి వెళ్ళు ||

సంతోషమరుదుగా దొరికింది తెలుసా
ఆనంద అమృతం ఒంపేసి వెళ్ళు ||

నటనలో నవ్వుల్ని ఏరుకుంటున్నా
ఓ నవ్వు తెమ్మెరగ వీచేసి వెళ్ళు ||

నిన్నలన్ని నా వెంట నడచొస్తు ఉంటే
వేదించు చిహ్నలు సరిచేసి వెళ్ళు ||

వాణినే మౌనమూ పలుకులే పదిలమూ
మాటల్ని మధువుగా రాల్చేసి వెళ్ళు ||

.....వాణి కొరటమద్ది
అడుగులన్ని దారి తెలియక ఆకశాన్ని చేరాయి ||
వీధి వీధి వెదకి వెదకి కన్నులలసి పోయాయి ||

చిరునవ్వులు చితిలోనే చిధ్రమై పోయె కదా
నా ఊహలు ఉనికి మరచి గతములోనె నిలిచాయి ||

వేసారెను మనసంతా మౌనమె ఆభరణమై
మాటలన్ని గుండెలోనె కుమిలి కుమిలి కరిగాయి ||

గగనానికి ఎందుకలా తొందరగా వెళ్ళావు?
క్షణాలన్ని నడువలేక భారంగా కరిగాయి ||

ఏమున్నది శూన్యంలో మమత కన్న గొప్పగా
అలుక ఇంత కఠినమా? దుఃఖాలే మిగిలాయి ||

ఎవరిని నేనడగాలి ? ఏమని ప్రశ్నించాలి ?
జ్ఞాపకాలు నిశ్శబ్దాలు బరువుగానె కదిలాయి ||

.....వాణి కొరటమద్ది
నా దేశపు మట్టి సదా పరిమళమని చెప్పవోయ్ ||
ఏ దేశపు వాసనలకు లోబడమని చెప్పవోయ్ ||

నీ భువిపై మేధావుల చరిత నీకు తెలియనిదా ?
ధన కాంక్షకు తలవంచుతు ఒరగమని చెప్పవోయ్ ||

పుణ్య స్ధల పురాణాలు ప్రతిచెట్టున ఔషదాలు
అరుదైనవి సంస్కృతులు ఘనమేనని చెప్పవోయ్ ||

మన భారత వాకిళ్ళకు భక్తిగానె మ్రొక్కవోయి
బ్రతుకుదారి ఏదైనా గొప్పేనని చెప్పవోయ్ ||

మన గణితం చదరంగం మెళుకువలు మన సంపద
నిండైనది విజ్ఞానపు భారతమని చెప్పవోయ్ ||

అద్వితీయ కళలెన్నో ఆశ్చర్యపు నిధులెన్నో
సంప్రదాయ అభిరుచులు విలువేనని చెప్పవోయ్ ||

.........కొరటమద్ది వాణి
జ్ఞాపకం గాలిగా చేరింది మనసులో..!
ఓదార్చు నిట్టూర్పు చరిచింది మనసులో..!

గగనాన ఓ తార నను చూసి నట్లుంది
తనరూపు తచ్చాడి మెరిసింది మనసులో..!

నీ స్పర్శ ఉనికేదొ తారాడి శూన్యంలొ
ఉలికిిపడి తనువంత తడిమింది మనసులో..!


నిను గెలుచు కాంక్షలో నేనోడి పోయాను
నిన్నల్లో నీ ప్రేమ నిలచింది మనసులో..!


తడి ఇంకి పోనట్టి నా మధుర భావాల
వేదనే కన్నీళ్ళు కురిసింది మనసులో..!

కాలాన్ని భారంగా కదిలిస్తు ఉన్నాను
అక్షరం వెంటాడి మురిసింది మనసులో...!

అన్వేషణ

ఎదిగే వయసు
ఒదిగే కాలం
రేపటిలోకి చూడాలని
రెప్పల తడి ఆర్పాలని

ఓడి పోయే ఎదురుచూపులు
ఊహల్లో మిగిలిన జ్ఞాపకాలు
తలవని క్షణం లేదు
తడవని రోజూ లేదు
బాధ , భావం
అక్షర అన్వేషణలో
పచ్చి కన్నీళ్ళ వెచ్చదనం
కొత్తగా వ్యక్తపరుస్తూ
కలం , కవనం మధ్య
నలుగుతున్న మనసు
అరుదైన గమనాన్నై
ప్రతి అడుగు అపురూపమై
వేకువకై , వెన్నెలకై తపన పడే
సగటు జీవి ఆరాటం
ఎటో తెలియని పయనం
బంధాలకై ఆరాటం
అనుభూతులు తడుముకుంటూ
దూరం దగ్గరవ్వాలని
అటు లేకున్నా
ఇటు ప్రయత్నమాపలేని నిస్సహాయత
అంతిమం తెలియదు
శ్వాసను ఆపనూలేను
బరువైన ముగింపు కోరుకోలేక
పలుకరించే స్పర్శకై
ఆఖరి మజిలీ దాకా ..!!
..... కొరటమద్ది వాణి